Tuesday, July 29, 2008
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై...
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై...
నిను కానలేక ,మనసూరుకోక.పాడాను నేను పాటనై..
నువ్వక్కడ నేనిక్కడ,పాటిక్కడ పలుకక్కడ
మనసొక్కటి కలిసున్నది ఏనాడైనా...
ఈ పువ్వులనే నీ నవ్వులుగా .ఈ చుక్కలనే నీ కన్నులుగా ,
నునునిగ్గుల ఈ మొగ్గలు నీ బుగ్గలుగా,,,,
ఊహల్లో తేలి ,ఉర్రూతలూగి,మేఘాలతోటి రాగాల లేఖ నీకంపినాను..రావా దేవి..
నీ పేరొక జపమైనది,నీ ప్రేమొక తపమైనది,
నీ ధ్యానమే వరమైనది ఏన్నాల్లైనా.....
ఉండీ... లేకా......ఉన్నది నీవే...ఉన్నా కూడా లేనిది నేనే...!
నా రేపటి అడియాశల రూపం నీవే...
దూరాన ఉన్నా ..నా తోడు నీవే...
నీ దగ్గరున్నా నీ నీడ ..నాదే...నాదన్నదంతా నీవే..నీవే....
మంచిమనసులు(కొత్తది)నుంచి సంగీతం ఇళయరాజా.
బంగారానికి,బంగారం లాంటి పాట :)
Subscribe to:
Post Comments (Atom)
5 comments:
శతకోటి ధన్యవాదాలు రాజేంద్ర గారు ... ఆణిముత్యం లాంటి పాట .. సాహిత్యం, సంగీతం, పదాల పొందిక, అర్ధం .. అన్నీ ఇలా ఒక దానితో(కి) మరొకటి పోటీయా లేక వన్నె తీసుకు వచ్చాయా అనిపించేటంతగా కుదిరిన పాట ... నాకు బాగా బాగా నచ్చిన పాటల్లో ఇది ఒకటి. ఇలా మీరు నిరంతరంగా మరిన్ని మంచి పాటలను పరిచయం చేయాలని కోరుకుంటూ ...
నిద్రపోయే ముందు ఈ పాట వింటున్నాను... హాయిగా ఉంది... మీకు నెనర్లు...
అద్భుతమైన పాట రాజేంద్ర గారు... ఇక్కడ వీడియో తో సహా మళ్ళీ ఓ సారి గుర్తు చేసినందుకు నెనర్లు.
దీని downlaod link ఏమన్న ఉంటే ఇవ్వగలరు
aswin gaaru,
meeru double click chesthe youtube ki veltharu. akkada nundi download chesukovataniki athyantha easy method idi...
Download real player 11 and install it on the mechine. when u do installation try to read all the instructions given in pop up and then do the same. Once you install,restart the youtube link u have there and you can see when ever you put the mouse on the video ,you can see on the top of the video ...download this video...danni klick chesi ..ekkada save cheyalo isthe automatic ga mee system lo save avuthundi...Hope this helped you ...
Post a Comment