ఇక్కడ మీరు చూస్తున్నది ఇద్దరుమితృలు చిత్రం లోని ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్ హలో హలో ఓ అమ్మాయి..పాత రోజులు మారాయి.అక్కినేని పక్కనున్నది ఇ.వి.సరోజ.అన్నపూర్ణావారి సినిమాలకు సహజంగా సావిత్రి కధానాయిక,కానీ ఈ సినిమాలో రాజసులోచన,ఇ.వి.సరోజలు హీరోయిన్లు.ఆ విషయమే సావిత్రి అడిగి్తే నీకు తగ్గపాత్ర కాదని ఆదుర్తి,అక్కినేని,నిర్మాత దుక్కిపాటి చెప్పారంటారు.కానీ సినిమా చాలా హిట్ ముఖ్యంగా సంగీతం సింప్లీ సుపర్బ్.అయితే మిత్రులొకాయన ఈమధ్య ఒకపర్షియన్ రెస్టారెంట్ లో ఈ పాట అసలును సుమారొక యాభయేళ్ళనాటి పర్షియాగీతాన్ని విన్నాను అన్నారు.ఆ వివరాలు తెలిసినవారు మాఅందరితో పంచు కోగలరని విన్నపం.
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
రాజేంద్ర గారు,
సాలూరి వారికి మధ్య ప్రాచ్యంలో బహు జనాదరణ పొందిన "Ye mustafaa" అన్న పాట బాణీ బాగా నచ్చి తెలుగులో దానిని అనుకరించారు. ఈ "ముస్తఫా" పాట ఎంత ప్రఖ్యాతి గాంచినదో తెలుసుకోవాలంటే YouTube లాంటి చోట వెతికి చూడండి :-) అనేక రంగులు, రుచులు, రూపాలు, వాసనల్లో కనపడుతుంది.
-- శ్రీనివాస్
Post a Comment