Tuesday, October 21, 2008

సినీదర్శకుడు శ్రీధర్ కు ఓ చిన్న నివాళి

ప్రముఖ సినీదర్శకుడు శ్రీధర్ భారతచలన చిత్ర చరిత్రలో ఒక అధ్యాయం పూర్తిగా తనకు సగౌరవంగా కేటాయింపజేసుకున్న వ్యక్తి.తమిళ్ లో ఆయన సినిమాలు తీసినా వాటిలో ఉండే యూనివర్సల్ అప్పీల్ వల్ల అన్ని ప్రముఖభాషల్లోకీ రూపాంతరం చెందాయి,కొన్ని సార్లు తమిళమాతృక కన్నా విజయవంతమయ్యాయి.కాదలిక్కు నేరమిల్లె తెలుగులో”ప్రేమించి చూడు’గా,హిందీలో ’ప్యార్ కియే’జాగా,వెలువడగా,పెళ్ళికానుక గా కళ్యాణపెరసు,అలాగే వయసుపిలిచింది,ఊర్వశీ,నీవే నాప్రేయసీ ఇలా ఎన్నో!!







ఆంధ్రజ్యోతి నుంచి





సాక్షి నుంచి

కాదలిక్కునేరమిల్లై సినిమా నుంచి ఒక మెలోడీ,అబ్బే అరవపాట అనకండి,పాడింది మన పి.సుశీల,పి.బి.శ్రీనివాస్,మహాకవి కణ్ణదాసన్ రచన,తెలుగులో అది ఒక ఇదిలే కు మాతృకన్నమాట.ఈ పాటలోని రాజశ్రీ ఈ సినిమా తెలుగు,తమిళ్,హిందీ మూడు వెర్షన్లలో నటించి ఒక రికార్డు సృష్టించింది.



ఇదా హిందీ ప్యార్ కియేజా నుంచి,శశికపూర్ తో రాజశ్రీ






పెళ్ళికానుక చిత్రం లోని గీతాలనన్నిటినీ ఈ కింది బాక్సుద్వారా వినవచ్చు.


ఇక ఈ పులకించని మదిపులకించు అన్న మధురాతిమధురగేయం చలనచిత్రగీతాలున్నంతకాలం అలా అలా హృదయాలను రంజింపజేస్తూనే ఉంటుంది.(గమనిక సర్వరు లోని లోపాలవల్ల కొన్ని సార్లు ఈ పాట సరిగాప్లే కాకపోవచ్చు,కావున ఒక్కసారి బ్రౌజర్ను రిఫ్రెష్ చేసి మరలా ప్లే చేయండి,మీ ఓపికకు తగ్గఫలితమిచ్చే పాట)





వయసు పిలిచింది నుంచి...
ఇలాగే..ఇలాగే సరాగమాడితే అన్న ఈ పాట మూడుదశాబ్దాలు గడిచినా నిత్యనూతనంగా ఉంటుంది,ఇళయరాజా సంగీతదర్శకత్వంలో పి.సుశీల పాడిన చాలా తక్కువపాటల్లోఅత్యంతమధురమైన గీతమిది.




నువ్వడిగింది ఏనాడన్నా కాదన్నానా అంటూ వాణీజయరాం గొంతు కొత్తపుంతలు తొక్కటం చక్కగా వినొచ్చు...






ఈపాటలోని నర్తకి ఎవరో తెలియదు గాని,నర్తకుడు మాత్రం డాన్స్ మాష్టర్ సలీం,ఈపాటతో సలీం,సంగీతం సమకూర్చిన ఇళయరాజా ఎక్కడికో అదిగిపోయారు.

Thursday, August 7, 2008

హలో హలో ఓ అమ్మాయి..పాత రోజులు మారాయి

ఇక్కడ మీరు చూస్తున్నది ఇద్దరుమితృలు చిత్రం లోని ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్ హలో హలో ఓ అమ్మాయి..పాత రోజులు మారాయి.అక్కినేని పక్కనున్నది ఇ.వి.సరోజ.అన్నపూర్ణావారి సినిమాలకు సహజంగా సావిత్రి కధానాయిక,కానీ ఈ సినిమాలో రాజసులోచన,ఇ.వి.సరోజలు హీరోయిన్లు.ఆ విషయమే సావిత్రి అడిగి్తే నీకు తగ్గపాత్ర కాదని ఆదుర్తి,అక్కినేని,నిర్మాత దుక్కిపాటి చెప్పారంటారు.కానీ సినిమా చాలా హిట్ ముఖ్యంగా సంగీతం సింప్లీ సుపర్బ్.అయితే మిత్రులొకాయన ఈమధ్య ఒకపర్షియన్ రెస్టారెంట్ లో ఈ పాట అసలును సుమారొక యాభయేళ్ళనాటి పర్షియాగీతాన్ని విన్నాను అన్నారు.ఆ వివరాలు తెలిసినవారు మాఅందరితో పంచు కోగలరని విన్నపం.



Tuesday, August 5, 2008

ఎడారిలో కోయిలా,,తెల్లారనీ రేయిలా..

ఈ బ్లాగులో కొనసాగుతూ అందరినీ ఆకట్టుకుంటున్న విరహవియోగాగీతాల ధారావాహికలో మరో ఎవర్ గ్రీన్ గీతం...ఎడారిలో కోయిలా,,తెల్లారనీ రేయిలా..పంతులమ్మ సినిమా నుంచి,సంగీతం రాజన్-నాగేంద్ర


Tuesday, July 29, 2008

జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై...





జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై...
నిను కానలేక ,మనసూరుకోక.పాడాను నేను పాటనై..

నువ్వక్కడ నేనిక్కడ,పాటిక్కడ పలుకక్కడ
మనసొక్కటి కలిసున్నది ఏనాడైనా...



ఈ పువ్వులనే నీ నవ్వులుగా .ఈ చుక్కలనే నీ కన్నులుగా ,
నునునిగ్గుల ఈ మొగ్గలు నీ బుగ్గలుగా,,,,
ఊహల్లో తేలి ,ఉర్రూతలూగి,మేఘాలతోటి రాగాల లేఖ నీకంపినాను..రావా దేవి..

నీ పేరొక జపమైనది,నీ ప్రేమొక తపమైనది,
నీ ధ్యానమే వరమైనది ఏన్నాల్లైనా.....

ఉండీ... లేకా......ఉన్నది నీవే...ఉన్నా కూడా లేనిది నేనే...!
నా రేపటి అడియాశల రూపం నీవే...
దూరాన ఉన్నా ..నా తోడు నీవే...
నీ దగ్గరున్నా నీ నీడ ..నాదే...నాదన్నదంతా నీవే..నీవే....


మంచిమనసులు(కొత్తది)నుంచి సంగీతం ఇళయరాజా.
బంగారానికి,బంగారం లాంటి పాట :)

Friday, July 25, 2008

కభీ..కభీ మేరే దిల్ మే..ఖయాల్

కభీకభీ సినిమా గురించి,అందులోని టైటిల్ సాంగ్ గురించీ తెలియనివారెవరు?తీవ్రసంఘర్షణకు గురయ్యే ప్రియురాలు,భార్య,తల్లి పాత్రల్లో రాఖీ చూయించిన ప్రతిభాపాటవాలు ఈ చిత్రానికో అదనపు ఆకర్షణ.


కభీకభీ చిత్రంలో శొభనపు పెళ్ళికూతురుగా రాఖీ

జయాబచ్చన్,భర్త గుల్జార్,అమితాబ్ తో రాఖీ





Monday, July 21, 2008

ఖిల్ తెహై గుల్ యహా..



1970లో వచ్చిన షర్మిలీ సినిమా ఒక సంచలనం.అద్భుతమైన సంగీతం,అతిచక్కని కధకధనాలు,నిర్మాణవిలువలు,దర్శకత్వప్రతిభ ఇవన్నీ ఈ చలనచిత్రాన్ని ఒక మరపురాని జ్ఞాపకంగా మలచాయి.ఇందులో అన్నీ మధురగీతాలే అయినా ఇక్కడ అతిచక్కటి పాటొక్కటి...రాఖీ కళ్లతో భావాలను ఎలా పలికించగలదో తెలియాలంటే ఇదొక మంచి ఉదాహరణ.

Khilte Hai Gul Yahan Lyrics

khilte hain gul yahaa, khil ke bikhar ne ko
milte hain dil yahaa, mil ke bichhadane ko

kal rahe naa rahe, mausam ye pyaar kaa
kal ruke naa ruke, dolaa bahaar kaa
chaar pal mile jo aaj pyaar mein gujaar do

zeelo ke hothhonpar meghon kaa raag hain
fulon ke seene mein thhandee thhandee aag hain
dil ke aaeene mein ye too samaa utaar le

pyaasaa hain dil sanam pyaasee ye raat hain
hothhon mein dabee dabee koee meethhee baat hain
in lamho pe aaj too har khushee nisaar de







ఈ మధురగీతం తెలుగులో ఇలా ఒక ఓదార్పు పాటలా,1973 లో వచ్చిన ధనమా?దైవమా చిత్రంలో రూపాంతరం చెందింది.